Thursday, May 22, 2025
Homeబీజినెస్టీసీఎస్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో భారీ ఆర్డర్‌

టీసీఎస్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ మరో భారీ ఆర్డర్‌

- Advertisement -

4జీ విస్తరణకు రూ.2,903 కోట్ల డీల్‌
ముంబయి : ప్రభుత్వ రంగంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ మరింత 4 జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం టీసీఎస్‌కు మరో భారీ ఆర్డర్‌ను ప్రకటించింది. దాదాపు రూ.2,903 కోట్ల విలువ చేసే ఈ ఆర్డర్‌లో మరో 18,685 టవర్లను 4జీకి అప్‌గ్రేడ్‌ చేయనుంది. 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాల కల్పన, ఇంజనీరింగ్‌, సరఫరా, ఇన్‌స్టాలేషన్‌, టెస్టింగ్‌, కమీషనింగ్‌, వార్షిక నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది. ఈ కాంట్రాక్టును టాటా గ్రూపులోని తేజస్‌ నెట్‌వర్క్‌ దృవీకరించింది.
రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌, సంబంధిత పరికరాల కోసం దాని సరఫరా విలువ సుమారు రూ.1,525.53 కోట్లు ఉంటుందని తేజస్‌ పేర్కొంది. అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత వివరణాత్మక ఆర్డర్‌లను జారీ చేస్తుందని కూడా కంపెనీ పేర్కొంది. 2023లోని తొలి ఒప్పందం ఆధారంగా ఈ ఆర్డర్‌ దక్కింది. ఆ ఏడాది 4 జీ విస్తరణ కోసం రూ.15,000 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -