దొరల రాజ్యం పోవాలి బహుజన రాజ్యం రావాలి

– నియోజకవర్గ ఎన్నికల కన్వీనర్ చాకలి రమేశ్  
నవతెలంగాణ -వీర్నపల్లి 
తెలంగాణ రాష్ట్రం పూర్తిగా దొరల చేతిలో బంది అయ్యిందని ఈ బంది అయిన తెలంగాణ విముక్తి కావాలంటే బీసీ, ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ పేదలకు ప్రాతినిథ్యం వహిస్తున్న బహుజన సమాజ్ పార్టీని అధికారం లోకి తేవాలని బీఎస్పీ సిరిసిల్ల నియోజక వర్గ ఎన్నికల కన్వీనర్ చాకలి రమేశ్ అన్నారు. వీర్న పల్లి మండలంలో పాస్టర్ ల  ను బిఎస్పీ నాయకులు కలిసి ఆశీర్వాదం తీసుకొని తెలంగాణాలో బీసీలకు చట్టసభల్లో వారి వాట ప్రకారం 60-70 సీట్లు కేటాయించిన ఘనత బీఎస్పీ కే దక్కుతుందన్నారు. ఎంతో ముందు చూపుతో మా యొక్క రాష్ట్ర రథ సారథి బహుజనుల ఆశా జ్యోతి డా. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తమ మానిఫెస్టో లో పెట్టడం జరిగినదన్నారు. సిరిసిల్ల నియోజక వర్గాన్ని తన అధికార అండతో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన పాలకులను తరిమి కొట్టాలని కోరారు. అటు బీజేపీ కూడా భారాస గెలుపు కోసం స్థానిక నాయకులకు కాదాని స్థానికేతరులకు టికెట్లు కేటాయించిందన్నారు. ఇద్దరు దొరలు ఒక దొరసాని ముగ్గురు కలసి ఒక బీసీ ముదిరాజ్ బిడ్డను ఓడించాలని చూస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా త్యాగాల సిరిసిల్లలో బహుజనులదే గెలుపు అన్నారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి న్యాయవాది పిట్టల భూమేష్ ముదిరాజ్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి ఇసంపల్లి కొమురయ్య, యేసు దాసు, జినుక శ్రీకాంత్, వేముల రాజేష్, చిట్యాల జ్యోతిబాబు , గౌతమ్ తదితరుల పాల్గొన్నారు.
Spread the love