– నామ పత్రాలు వేయనున్న అభ్యర్థులు
– మనిషికి రూ.200 నుంచి 500 వరకు…
– దృష్టి పెట్టని వ్యయ పరిశీలకులు
అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల చివరి గడువు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. రిటర్నింగ్ అధికారులు ఈనెల 3న నామినేషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఈనెల 10వ తేదీన చివరి తేదీ గడువు విధించారు. ఇప్పటికే ప్రారంభమైన నామినేషన్లు స్వతంత్ర అభ్యర్థులు ఆయా చిన్న పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మందకోడిగా సాగిన నామినేషన్ల పర్వం నేడు గురువారం ఏకాదశి కావటం…మంచి రోజు ఉండటం తో ఇదే రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులు గురువారం వేసేందుకు సిద్ధమయ్యారు.
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నేడు నామినేషన్లు వేయనున్నారు. ఆ పార్టీ అభ్యర్థులు జన సమీకరణ చేసి నియోజక వర్గా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులను జన సమీకరణ చేయాలని పురమాయించారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ఎంత ఖర్చైనా భరిస్తామని కింది స్థాయి నాయకులకు అభ్యర్థులు చెప్తున్నారు. దీంతో జన సమీకరణ కోసం కింది స్థాయి కేడర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 10న శుక్రవారం మంచి రోజు కూడా కావడంతో ఆరోజు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
అన్ని నియోజవర్గాల్లోనూ నేడు నామినేషన్లు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీజేపీి, బీఎస్పీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ వేశారు. బుధవారం కోదాడలో బీఆర్‌ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ నామినేషన్ వేశారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. గురువారం కూడా మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మనిషికి 200 నుంచి 500 వరకు…
నామినేషన్‌కి వచ్చే పెయిడ్ ఆర్టిస్టులకు మనిషికి 200 నుంచి 500 రూపాయల వరకు ఇచ్చేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. ప్రధానంగా బీిఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇచ్చి జనం సమీకరించినందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీ కిందిస్థాయి నాయకులకు వార్డులు గ్రామాల వారిగా లక్షల రూపాయలు అందించినట్లు సమాచారం. ప్రతి 20 మందికి ఒక లీడర్ ఏర్పాటు చేసి వారిని సమీకరిస్తున్నారు నామినేషన్‌కు వచ్చిన వారి పేర్లను ఆయా ఇన్‌చార్జి నమోదు చేసుకొని నామినేషన్ పూర్తయ్యాక డబ్బులు ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టగా ఆ ప్రచారానికి జన సమీకరణ కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. ప్రచారానికి వస్తే 200 నుంచి 500 రూపాయలకు ఇస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నారు. సీపీఐ(ఎం) అభ్యర్థుల నామినేషన్ కు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నట్టు సమాచారం.
దష్టి పెట్టని వ్యయ పరిశీలకులు
ఎన్నికల పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరించి ఎన్నికల వయ పరిశీలకులు ఆ దిశగా దష్టి పెట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే విస్తత ప్రచారం చేస్తుండడంతో వాటి ఖర్చులను పరిగణించడం లేదని ఇతర పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన జరగడంతో వాటికోసం అభ్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు సమాచారం ఆ ఖర్చులను నామాత్రంగా చూపిస్తున్నట్లు అధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా నామినేషన్ వేసిన నాటి నుండి అభ్యర్థుల ఖర్చులను నమోదు చేయనున్నారు. నామినేషన్ రోజున పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నప్పటికీ జనాలకు ఇచ్చే డబ్బులను పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తుంది. ర్యాలీలో ఉపయోగించిన జెండాలు, బ్యాడ్జీలు ,టోపీలు, ఇతర ఖర్చులు మాత్రమే అభ్యర్థుల ఖర్చుల కింద చూపించనున్నారని అనధికారికంగా జరిగే ఖర్చులను పరిగణనలోకి తీసుకోవడం లేదని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా పై ఎన్నికల అధికారులు దష్టి పెట్టడం లేదు. అందులో జరిగే ప్రచారంపై ఖర్చులు లెక్కించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.