Saturday, January 10, 2026
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల  

నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల  

- Advertisement -


నవతెలంగాణ – ఆలేరు

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో పత్రికల పాత్ర చాలా ముఖ్యమైందని ప్రభుత్వ విప్ ఆలేర్ ఎంఎల్ఏ బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం యాదగిరిగుట్టలోని తన నివాసంలో నవతెలంగాణ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు వెలికి తీసి ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావడంలో పత్రికల పాత్ర గణనీయంగా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నవతెలంగాణ దినపత్రిక కార్మికుల, కర్షకుల, మహిళల, విద్యార్థుల సమస్యలపై చేసే ప్రజా ఉద్యమాలను, ప్రభుత్వం దృష్టికి అధికారులకు తెలిసే విధంగా కథనాలు ప్రచురిస్తూ.. కల్పిత కథనాలకు చోటు లేకుండా వాస్తవాలతో వార్తలు రాయడంలో నవతెలంగాణ పత్రిక యాజమాన్యం రిపోర్టర్లు ముందున్నారన్నారు అంటూ కొనియాడారు.

అదేవిధంగా పత్రికా సిబ్బందికి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట సిఐ బొడ్డుపల్లి భాస్కర్, ఆలేర్ మాజీ సర్పంచులు ఆకవరం మోహన్ రావు, సందుల సురేష్, గుట్ట మున్సిపల్ మాజీ  చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్, వర్తక సంఘం అధ్యక్షులు గడ్డమీది మాధవులు గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ పులిపాక గోపాల్, నవతెలంగాణా సీనియర్ జర్నలిస్టులు ఎస్కే ఉస్మాన్ షరీఫ్, మొరిగాడి మహేష్, యాదగిరి గుట్ట రిపోర్టర్లు పేరబోయిన నర్సింహులు, బూడిద చంద్ర గిరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -