నామినేషన్ కేంద్రం వద్ద నామినేషన్ వేసే క్రమంలో స్వల్ప ఉద్రుక్తత

నవతెలంగాణ- కంఠేశ్వర్: నిజాంబాద్ జిల్లా కేంద్రంలో నామినేషన్ నిజామాబాద్ అర్బన్ రూరల్ కేంద్రాల వద్ద ఇరు పార్టీల నాయకులు నామినేషన్ వేసే క్రమంలో స్వల్ప ఉధృక్తతకు నెలకొంది. అధికార పార్టీ నాయకులు ఎన్నికొడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అదికారంలో ఉన్నామని ఎన్నిక నిబంధనలు పాటించకుండా నిబంధనలను తుంగలో తొక్కు తున్న చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు  ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి అంద రూ సమానంగా ఉండాలే కానీ వాళ్లకో నిబంధన మాకో నిబంధన ఎందుకని ప్రశ్నిం చారు. ఇంత జరుగుతున్న పోలీసులు బీఆర్ఎస్ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రేక్షక పాత్ర వహి స్తున్నారంటూ ధ్వజమెత్తారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బాజీరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి భూపతిరెడ్డి, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ లు నిజామాబాద్ నగరం లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేసే క్రమంలో కొద్దిగా గందర గోళ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏసిపి కిరణ్ కుమార్ సముదాయించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒకేరోజు పోటాపోటీగా నామినేషన్లు నిజామాబాద్ జిల్లాలో ఒకేరోజు ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా భూపతిరెడ్డిలు నిజామాబాద్ నగరంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు వేశారు. పార్టీల నాయకులు కార్యకర్తలతో నామినేషన్ కేంద్రం వద్ద సందడి నెలకొంది.

Spread the love