Sunday, January 11, 2026
E-PAPER
Homeఖమ్మంనియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలి:  జాక్టో 

నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలి:  జాక్టో 

- Advertisement -

నవతెలంగాణ – బోనకల్
2010 సంవత్సరం కంటే ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోత్ రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండల కమిటీ జాక్టో ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం  చేశారు. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ 2010 సంవత్సరం కంటే ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టీఈ చట్టం 2009లోని క్లాజ్23(1) ని సవరించి టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎన్ సి టి ఇ నిబంధనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ఈ సమస్య వలన రాష్ట్రంలోని  45 వేలమంది ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు కల్పించాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రైవేటు పాఠశాలల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య విద్యార్థుల లేరనే పేరుతో మూసివేస్తున్నారని దీనివలన ప్రభుత్వ విద్యారంగానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతుల కల్పించడానికి పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు సద్దా బాబు మండల అధ్యక్షులు గార్లపాటి చిన రంగారావు, సీనియర్ నాయకులు కె లక్ష్మణరావు, యన్ నాగ మహేష్, మండల కార్యదర్శులు సిహెచ్ కోటేశ్వరరావు, ఎం నరేంద్ర సింహ, మండల ఉపాధ్యక్షురాలు కే సౌభాగ్య లక్ష్మి, బానోతు రమేష్, రిటైర్డ్ ఉపాధ్యాయులు పిల్లలమర్రి వెంకట అప్పారావు, సురేష్, మురళీకృష్ణ, జి శ్రీనివాసరావు, తిరుపతిరావు, శశికళ, కే సురేష్, కనకరాజు  సత్యానందం, హరికృష్ణ, సానం ప్రసాద్, సరస్వతి, ప్రశాంతి, సిహెచ్ విజయలక్ష్మి, ముంతాజ్ ఖాతుమ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -