నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి దేవాలయ ధర్మాదాయ శాఖ ఆలయ ఆదాయం రూ.8,49,785 వచ్చినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శుక్రవారం తెలిపారు. ఆలయ హుండీ లెక్కింపును ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ ఆలయ పాలకవర్గం సభ్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి లెక్కింపు చేపట్టారు. సాయంత్రం వరకు హుండీ లెక్కింపు పూర్తయిన తర్వాత ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విలేకరులకు వివరాలు తెలియజేశారు. ఈ మొత్తంలో రూ.7,19,530 నోట్ల రూపంలో, అదేవిధంగా రూ.1,30,255 నాణ్యాల రూపంలో ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో చైర్మన్ రామ్ పటేల్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమలాబాయి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్, ఇతర అధికారులు, పాలకవర్గం సభ్యులు, పూజారులు, ఆలయ సిబ్బంది, భక్తులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.
సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



