అగ్ర కథానాయిక సమంత నటిస్తున్న కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’. రాజ్ నిడిమోరు క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. ‘ఓ బేబీ’ తరువాత సమంత, నందినిరెడ్డి కాంబోలో వస్తున్న చిత్రమిది. శుక్రవారం మేకర్స్ ఈచిత్ర గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. కామెడీతో నవ్వించే సినిమా ఉన్నట్లుండి రియలిస్టిక్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌గా జరిగే మార్పును ఈ టీజర్‌లో స్పష్టంగా చూడవచ్చు. టీజర్‌లో సమంతను సాధారణమైన గృహిణి పాత్రలో చూపించారు. అయితే ఆమె తన అత్తగారింటికి వెళ్ళిన తరువాత పరిస్థితులు తలకిందులవుతాయి. నవ్వుతూ మృదు స్వభావిగా కనిపించే సమంత ఉన్నట్లుండి ఎదురుదాడి చేసేంత శక్తివంతురాలిగా మారుతుంది. దీంతో సమంతలోని రెండు భిన్న కోణాలు అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది అని చిత్రయూనిట్ తెలిపింది. దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తుండగా, గౌతమి, మంజుషా ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత, రాజ్ నిడిమోరు, హిమాన్క్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



