ఉద్యోగ, కార్మికుల సమస్యలు
వెంటనే పరిష్కరించాలి
సీఐటీయూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా
కార్మికుల ఆందోళన
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ఖమ్మం రూరల్ మండలంలోని పెద్దతండా వద్దనున్న మారుతీ సుజుకి షోరూం యాజమాన్యం పట్టుదలకు వెళ్లకుండా ఉద్యోగ, కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన ఆందోళన శుక్రవారం నాలుగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పెరుమళ్ళపల్లి మోహన్ రావు మాట్లాడుతూ.. మారుతి సుజుకి అండ్ పరమశివ షోరూంలో 22 ఏండ్లుగా వివిధ కేటగిరీల్లో 140 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వారికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా షోరూంను మూసివేయడంతో ఉద్యోగ, కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయిని తెలిపారు. ఈనెల 5న ఉదయం 9 గంటలకు షోరూం నష్టాల్లో ఉంది.. మీరు వేరే పని చూసుకొండంటూ యాజమాన్యం సెల్‌ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వడం దుర్మార్గమన్నారు. 140 మంది కార్మికులు 22 ఏండ్ల్లుగా ఒక సంస్థను నమ్ముకొని పనిచేస్తుంటే వాళ్ళని అర్ధాంతరంగా తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. షోరూం ఉద్యోగ, కార్మికులకు యాజమాన్యం న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వారికి వివిధ రకాల బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి, సీఐటీయూ నాయకు లు మల్లికార్జు నరావు, కర్లపూడి వెంకటేశ్వర్లు, సంస్థ ఉద్యోగ, కార్మికులు నాగ శ్రీనివాస్ రావు, రాందేవ్, వెంకటేశ్వ రరావు పాల్గొన్నారు.
మారుతీ సుజుకి షోరూమ్ మూసివేత దారుణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



