రూ.40లక్షల ఆస్తి, లిక్కర్ నష్టం..
షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక అంచనా
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఘటన
నవతెలంగాణ- మరిపెడ
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బార్ అండ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం సంభవించి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కేంద్రంలోని సెవెన్ హిల్స్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ తెల్లవారుజామున 5:30 సమయంలో పొగలు రావడంతో అటుగా వచ్చిన వాకర్స్, రైతులు.. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల శ్రమించి మంటలు అదుపులోకి తీసుకువ చ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు, సుమారు రూ.40 లక్షల ఆస్తి, లిక్కర్ నష్టం వాటిల్లినట్టు బార్ యజమాని దుబ్బాక నరేష్ రెడ్డి తెలిపారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో కౌంటర్‌లో ఉన్న ముఖ్యమైన ఫైల్స్, కొంత నగదు మంటల్లో కాలిపోయినట్టు ఆయన వెల్లడించారు.
బార్ అండ్ రెస్టారెంట్లో.. అగ్ని ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



