Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెంట్రల్ గవర్నమెంట్ అడిషనల్ స్టాండింగ్  కౌన్సిల్ మెంబర్ గా రుయ్యాడి రాజేశ్వర్

సెంట్రల్ గవర్నమెంట్ అడిషనల్ స్టాండింగ్  కౌన్సిల్ మెంబర్ గా రుయ్యాడి రాజేశ్వర్

- Advertisement -

నవతెలంగాణ – మెండోర
ఆర్మూర్ కోర్టులో విధులు నిర్వహిస్తున్న సావెల్ గ్రామ వాస్తవ్యులు ప్రముఖ సీనియర్ న్యాయవాది రుయ్యాడి రాజేశ్వర్ సెంట్రల్ గవర్నమెంట్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా నియామకం అయ్యారు. ఆర్మూర్ బార్ అసోసియేషన్ లో  న్యాయవాదులు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు , పలు రాజకీయ పార్టీ నాయకులు , కార్యకర్తలు , ఉద్యోగులు మరియు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం రుయ్యాడి రాజేశ్వర్  మాట్లాడుతూ.. గత 33 సంవత్సరాలుగా బాల్కొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కి అందుబాటులో ఉంటూ నేను అందించిన నిస్వార్థమైన సేవలను గుర్తించి నన్ను సెంట్రల్ గవర్నమెంట్ అడిషనల్ స్టాండింగ్  కౌన్సిల్ మెంబర్ గా నియమించిన భారత ప్రధాని  నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రులు బండి సంజయ్ , కిషన్ రెడ్డి లకు, తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్ర రావు కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

నాపై నమ్మకంతో సెంట్రల్ గవర్నమెంట్ అడిషనల్ స్టాండింగ్  కౌన్సిల్ మెంబర్ గా నియమించిన కేంద్ర ప్రభుత్వం తరఫు కేసులలో వాదనలు వినిపించి కేంద్ర ప్రభుత్వానికి పేరు ప్రతిష్టను తీసుకువచ్చేలా ప్రభుత్వం తరఫున సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ధీమాను వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -