- Advertisement -
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో గల మద్నూర్, డోంగ్లి, మండలాల గ్రామాల వ్యాపారులకు ఎస్సై రాజు చైనా మాంజా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మద్నూర్ మండల కేంద్రంలోని పతంగులు మాంజాలు అమ్మే దుకాణాలను తనిఖీ చేశారు. చైనా మాంజా వలన పిల్లలకు చాలా ప్రమాదమని తెలిపారు. అందుకే వాటిని నిషేధించామని తెలిపారు. వీటిని ఎవరైనా అమ్మితే వెంటనే పోలీసుకు సమాచారం అందించాలని, వారి వివారాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. చైనా మాంజా అమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని వ్యాపారులకు సూచించారు.
- Advertisement -



