నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం లోని సోమూర్ ఎక్స్ రోడ్ వద్ద కల సన్ షైన్ పాఠశాలలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జక్కువార్ అశోక్ మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో సంక్రాంతి పండుగను తమ పంట చేన్లలో లక్ష్మీ దేవి పూజ చేసి దీపాన్ని లక్ష్మీ గా భావించి ఇంటికి తీసుకొని వచ్చి పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తారు అని అన్నారు.
సాయంత్రం నువ్వులు, బెల్లం పంచుకొని అలయ్ బలయ్ తీసుంటారని వివరించారు. గ్రామాలలో ఉదయాన్నే లేచి సంక్రాంతి సంబరాలను ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో నిర్వహిస్తుంటారు. అందుకే పాఠశాల సెలవు దినాల కార్యక్రమం ఏర్పాటు చేశామని విద్యార్థులచే సంక్రాంతి పండుగ ఉత్సవాలు ఎలా నిర్వహించాలో గ్రామీణ ప్రాంతాల పండుగల వాతావరణాన్ని కల్లకుకద్దే విధంగా విద్యార్థులచే ఉత్సవాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ .జక్కువార్. అశోక్, కారెస్పాన్డెన్స్ శివ పటేల్ , విద్యార్థులు,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



