Sunday, January 11, 2026
E-PAPER
Homeఖమ్మంపిఎసిఎస్, డిసిసిబి లకు నామినేట్ వద్దు..ఎన్నికలే ముద్దు

పిఎసిఎస్, డిసిసిబి లకు నామినేట్ వద్దు..ఎన్నికలే ముద్దు

- Advertisement -

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ – బోనకల్

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సహకార  సంఘాలకు (పిఎసిఎస్ ), జిల్లా కేంద్ర సహకార సంస్థలకు, (డిసిసిబి )పాలక మండలి నామినేట్ చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఖమ్మం జిల్లా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండల కేంద్రంలో శనివారం నవ తెలంగాణతో సహకార సంఘాలు ఎన్నికలు, నామినేటెడ్ పద్ధతి విధానంపై ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికల నిర్వహించడం ద్వారా పాలకవర్గం ఎన్నిక చేయాలని కోరారు. ఈ విధానం వలన రైతులకు ఎంతో ఉపయోగకరం గా ఉంటుందన్నారు. సహకార సంఘాలలో వ్యవసాయ భూమి ఉన్నవారే సభ్యులుగా ఉంటారని వారు రైతులుగా ఉండటం వలన సహచర రైతుల ఇబ్బందులు కష్టాలు తెలుస్తాయి అన్నారు.

రైతు ప్రతినిధులు కాకుండా రాజకీయ కార్యకర్తలను నామినేట్ చేసి విధానమును అమలు చేసి సహాకార వ్యవస్ధను నాశనం చేసే విధానం వద్దన్నారు. దీనివలన రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సహకార వ్యవస్థలోకి రైతులు కాకుండా రాజకీయ నాయకుల ప్రవేశం జరిగితే అది రాజకీయ పునరావస్య కేంద్రంగా మారి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సహకార వ్యవస్థ రైతులకు న్యాయం చేసే వ్యవస్థగా కాకుండా రాజకీయ పునరావస కేంద్రంగా మారి సహకార వ్యవస్థ అనేది ఒక ప్రమాదకరంగా మారుతుంది అన్నారు. ఎప్పటినుంచో సహకార వ్యవస్థ రైతులకు పూర్తిస్థాయిలో మేలు చేస్తుందన్నారు. వ్యాపార బ్యాంకుల ద్వారా రైతులు రుణాలు తీసుకొని తీవ్రంగా నష్టపోతుండగా సహకార సంఘాల ద్వారా వ్యవసాయానికి రుణాలు తీసుకున్న అన్నదాతలు అనేక రకాలుగా లాభాలు పొందుతున్నారు అన్నారు.

సహకార వ్యవస్థ లనికి రాజకీయ నాయకుడు ప్రవేశం జరిగితే రాజకీయ రుణాలు వ్యవస్థగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయకపోవడం, యూరియా సరఫరా లో ప్రభుత్వం పట్ల  రైతులు వ్యతిరేక భావం తో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి దారిన ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలను నామినేట్ సభ్యులు ద్వారా కబంధ హస్తాల్లో కి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేయడం దుర్మార్గం అన్నారు. రైతుల షేర్ క్యాపిటల్ తో పాటు ప్రభుత్వ సహకారంతో దశాబ్దాల నుంచి రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు అందించడంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంస్థల పాత్ర గణనీయంగా ఉందన్నారు.

అలాంటి వ్యవస్థలో నామినేట్ చేసే ఆలోచన విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ఖర్చు ఎక్కువవుతుంది అనే అలోచనతో ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా నామినేట్ చేస్తే ఇతర ఎన్నికలను కూడా ఖర్చు పేరుతో అలానే చేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సహకార సంఘాలపై అనాలోచిత ఆలోచనలు నిర్ణయాలను మానుకొని యధాస్థితిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తక్షణమే సహాకార సంఘాలకు ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా 19 డిసెంబర్ 2025న సహకార సంఘాల పాలకవర్గాలను రద్దుచేసి 20 డిసెంబర్ 2025న ప్రత్యేక అధికారులను నియమించింది అన్నారు. దీనివలన రైతులకు నష్టమే తప్ప లాభం జరగదు అన్నారు. రైతు ప్రభుత్వం అంటూ రైతులకు తీవ్ర నష్టం జరిగే విధానాలను అమలు చేయడం రాష్ట్రప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని లేని ఎడల తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -