– ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామ సమీపాన అర్& బీ రోడ్డు పైన రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామ సమీపాన జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్వాపూర్ గ్రామానికి చెందిన సుంకరి విట్టల్ (25) పెద్ద ఏడ్గి వైపు వెళ్తున్న క్రమంలో జుక్కల్ కు చెందిన శంకర్ (33) పెద్ద ఏడ్గి నుండి జుక్కల్ కు వస్తున్న క్రమంలో గ్రామ సమీపాన రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో శంకర్ విట్టల్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు. శంకర్ నున బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే శంకర్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబీకులు తెలిపారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



