Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సునీల్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే కోటీశ్వరుడు

సునీల్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే కోటీశ్వరుడు

- Advertisement -

– టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ 
బిఆర్ఎస్ నాయకుల విష ప్రచారం సరికాదు 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మా నాయకుడు సునీల్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే కోటీశ్వరుడని, రాజకీయాల్లోకి ప్రజలకు  సేవ చేయడం కోసమే వచ్చారని టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవితో కలిసి మాట్లాడారు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కు సంబంధించిన ఆరెంజ్ ట్రావెల్స్ జీఎస్టీ విషయంపైన గత రెండు రోజులుగా బాల్కొండ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, విషప్రచారం చేస్తున్నారన్నారు. మా నాయకుడు సునీల్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే కోటీశ్వరుడని, రాజకీయాల్లోకి ప్రజలకు  సేవ చేయడం కోసమే వచ్చారన్నారు.

కానీ మీ నాయకులు ప్రశాంత్ రెడ్డి,  వారి అనుచరులు కేవలం సంపాదనే లక్ష్యంగా వచ్చారని విమర్శించారు. 2014 సంవత్సరానికి ముందు మీ ఆస్తులు ఎంత? ఇప్పుడు మీ ఆస్తులు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించారు. వ్యక్తిగత వ్యాపార విషయాలను రాజకీయ కోణంలో చూస్తూ సునీల్ రెడ్డిని బద్నం చేయడమే లక్ష్యంగా bఆర్ఎస్ పార్టీ తన సొంత చానళ్లలో, పత్రికలలో, తమ నాయకులతో విషప్రచారం చేస్తున్నారన్నారు. సునీల్ రెడ్డి ఆరెంజ్ ట్రావెల్స్ కి సంబంధించిన న్యాయంగా కట్టాల్సిన జిఎస్టి పన్నును 5 శాతం కట్టారని, కానీ ఆదాయ పన్ను అధికారులు 12శాతం కట్టాలని బలవంతంగా ఒత్తిడి చేయడంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. న్యాయంగా కట్టాల్సిన పన్ను కట్టడం వల్లనే న్యాయస్థానం కేసు కొట్టివేసిందని గుర్తు చేశారు.ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఎన్నో అవార్డులు గెలుచుకున్న గొప్ప సంస్థ అని పేర్కొన్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో సునీల్ రెడ్డి తన సంస్థ ద్వారా ఎన్నో ఉచిత సేవా కార్యక్రమాలను చేశారని, పేదలకు ఉచితంగా ఆహార సరుకులను అందజేసారన్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్  నాయకులు అసత్య ఆరోపణలు, విషప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి, సునీల్ రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఇలా బురద చల్లే ప్రయత్నంచేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోళ్ల శివ కుమార్, జిల్లా కార్యదర్శి తక్కూరి దేవేందర్, మోర్తాడ్ మండల అధ్యక్షులు ముత్యాల రాములు, జిల్లా కిసాన్ ఖేత్ ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం గంగాప్రసాద్, హాసాకొత్తూర్ సర్పంచ్ రేవతి గంగాధర్, సల్లూరి గణేష్, నిమ్మ ప్రసాద్, బుచ్చి మల్లయ్య, అవారీ సత్యం, పాషా, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -