Monday, April 27, 2026
E-PAPER
Homeజాతీయంనిప్పుల కొలిమి.

నిప్పుల కొలిమి.

- Advertisement -

– పెరుగుతున్న వడగాలుల తీవ్రత
– ప్రపంచంలోని 100 అత్యంత వేడి పట్టణాల్లో 98 భారతదేశంలోనే..

న్యూఢిల్లీ: ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. డజన్ల కొద్దీ భారతీయ నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ జాబితాలో కేవలం ప్రధాన మహానగరాలే కాకుండా చిన్న పట్టణాలు కూడా ఉండటం ఈ వడగాలుల తీవ్రతను స్పష్టం చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని బింద్కిలో ప్రపంచంలోనే అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాని తర్వాతి స్థానాల్లో ఉన్న ఫతేపూర్‌, ఇటావాలలోనూ 46డిగ్రీలు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌, ఒడిశా, బీహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నగరాలు ఈ వేడి తీవ్రతను ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ఈ వేడి తీవ్రతను ప్రపంచ వ్యాప్తంగా లెక్కగడితే 100కు 98 నగరాలు ప్రస్తుతం భారతదేశంలోనే ఉన్నాయి. జాబితాలో మిగిలిన ఆ రెండు భారతేతర నగరాలుగా నేపాల్‌లోని ధన్‌గఢి 57వ స్థానంలో, లుంబిని 94వ స్థానంలో ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని రూర్‌కీ 44డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో 100వ స్థానంలో నిలిచింది.కేరళ కూడా తీవ్రమైన వేడితో అల్లాడుతోంది. పలు ప్రాంతాల్లో వడదెబ్బ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం పాలక్కాడ్‌లో 40.2 డిగ్రీల సెల్సియస్‌, పునలూరులో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్రమైన వేడి హెచ్చరికలు జారీ చేసి, ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రజలకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వచ్ఛంద స్వీయ నిర్బంధం పాటించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -