Sunday, January 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువిదేశీ మారకం నిల్వల్లో భారీ పతనం

విదేశీ మారకం నిల్వల్లో భారీ పతనం

- Advertisement -

వారంలో 9.8 బిలియన్‌ డాలర్ల తగ్గుదల
గడిచిన 14 నెలల్లో అత్యధికం : ఆర్బీఐ వెల్లడి


ముంబయి : భారతదేశ విదేశీ మారకం నిల్వల్లో భారీ పతనం చోటు చేసుకుంది. ఒక్క వారంలోనే దాదాపు 10 బిలియన్‌ డాలర్లు కరిగిపోయాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.90వేల కోట్లకు సమానం. జనవరి 2తో ముగిసిన వారంలో ఏకంగా 9.809 బిలియన్‌ డాలర్లు తగ్గి 686.801 బిలియన్లకు పరిమితమయ్యాయని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇది ఇంతక్రితం వారంలో నమోదైన 696.61 బిలియన్లతో పోల్చితే భారీ తగ్గుదలను సూచిస్తుందని వెల్లడించింది. జనవరి 2తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలలో ప్రధాన భాగం అయినా విదేశీ కరెన్సీ ఆస్తులు 7.622 బిలియన్‌ డాలర్లు తగ్గి 551.99 బిలియన్లకు పరిమితమయ్యాయి.

ఈ ఆస్తులలో యూరో, యెన్‌, పౌండ్‌ వంటి కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే విలువలో హెచ్చు తగ్గులు చెందడం ఈ తగ్గుదలకు కారణం. మరోవైపు ఇటీవల డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డ్‌ స్థాయిలో 91కి పడిపోవడంతో ఈ విలువ తగ్గింది. అదే సమయంలో బంగారం నిల్వలు 2.058 బిలియన్లు తగ్గి 111.262 బిలియన్లకు చేరాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) 25 మిలియన్లు తగ్గి 18.778 బిలియన్‌ డాలర్లకు తగ్గాయని వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)లో భారతదేశ నిల్వలు 105 మిలియన్‌ డాలర్లు క్షీణించి 4,771 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి. భారత విదేశీ మారకం నిల్వలు తగ్గితే ప్రధానంగా రూపాయిపై ఒత్తిడి పెరగనుంది. ఇది విదేశీ చెల్లింపులపై తీవ్ర ఒత్తిడిని పెంచనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -