Sunday, January 11, 2026
E-PAPER
Homeసోపతిటైపింగ్‌లో అంతర్జాతీయ ఘనత

టైపింగ్‌లో అంతర్జాతీయ ఘనత

- Advertisement -

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన విద్యార్థి దెందె రామ్‌చరణ్‌ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ రికార్డును సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు. కేవలం 48 సెకన్లలో 100 ఇంగ్లీష్‌ పదాలను కంప్యూటర్‌ కీబోర్డు ద్వారా టైప్‌ చేసి ”అంతర్జాతీయ ప్రపంచ అత్యుత్తమ రికార్డులు ఉ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో తన పేరును నమోదు చేసుకున్నాడు.

ఈ ఘనతను రామ్‌చరణ్‌ 2025 అక్టోబర్‌ 13న హైదరాబాద్‌ నుంచి సాధించాడు. అప్పటికి అతని వయస్సు 12 సంవత్సరాలు 11 నెలలు. చిన్న వయసులోనే టైపింగ్‌లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించడం విశేషంగా నిలిచింది.గత ఐదేళ్లుగా కంప్యూటర్‌ కీబోర్డు వినియోగంలో నిరంతర సాధన చేస్తూ వచ్చిన రామ్‌చరణ్‌ ప్రస్తుతం హబ్సిగూడలోని శ్రీ సాయి పబ్లిక్‌ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి పోలీస్‌ శాఖలో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ ప్రతినిధులు రామ్‌చరణ్‌కు సర్టిఫికేట్‌ మరియు మెడల్‌ను అందజేశారు. మెడల్‌ రావడంతో కుటుంబ సభ్యులకు ఆనందం నెలకొన్నది. ప్రతిభ చాటిన రామ్‌ చరణ్‌ ను ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం సన్మాంచి అభినందనలు తెలిపారు.ఈ విజయం జిల్లాలోని విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -