Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్షార్ట్ సర్క్యూట్ తో వరిగడ్డి దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో వరిగడ్డి దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం వీరన్న గుట్ట శ్రీ రామాలయం పక్కనున్న గోశాలలో సుమారు 15 ట్రాక్టర్ల వరిగడ్డి దగ్ధమైంది. ఈ ఘటనకు ప్రధానంగా విద్యుత్తు శాఖ కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో 11 కెవి లైవ్ తొలగించాలని పలుమార్లు స్థానిక ఏఈ, విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని వారన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రైతుల వద్ద సేకరించిన సుమారు 15 ట్రాక్టర్ల వరిగడ్డిని గోవుల కోసం ఉంచాగా అది పూర్తిగా దగ్ధమైందన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ట్రాన్స్కో అధికారులు 11 కెవి లైన్ ను అక్కడి నుండి తొలగించి పక్కకు జరపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -