భారతీయ సినీ పరిశ్రమకి అపూర్వమైన సేవలు అందించిన పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో అత్యంత ఘనంగా జరిగింది.
కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నిర్మాత అశ్వినిదత్, సినీ, రాజకీయ ప్రముఖులు, సూపర్ స్టార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కృష్ణకి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హీరో జయకృష్ణ మాట్లాడుతూ,’నేను ఏం చేసినా తాతయ్య నా పక్కనే ఉంటూ నడిపిస్తుంటారని పిస్తోంది. ఆయనతో గడిపిన సమయం, ఆయన నాకు చెప్పిన మాటలు, ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటాయి.
నా జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి మా బాబాయ్ మహేష్ బాబు. ఆయన నాకు ఎప్పుడూ గైడెన్స్ ఇస్తారు. నేను ఆయనకి వీరాభిమానిని. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది నాకు నా జీవితంలో ప్రౌడ్ మూమెంట్. మహేష్ బాబు నా ఇన్స్పిరేషన్. 40 ఏళ్ల క్రితం ఇదే రోజు ‘అగ్నిపర్వతం’ సినిమా రిలీజ్ అయింది. అశ్విని దత్ ఆ సినిమాని నిర్మించారు. మహేష్ బాబాయ్ ని కూడా ఆయనే లాంచ్ చేశారు. ఈ ఏడాది ఆయన నన్ను లాంచ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.
వైభవంగా కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


