డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బస్తీ దవాఖానాల్లో మందుల కొరత, అన్ని రకాల టెస్టులు చేసుకునే అవకాశం లేకపోవడంపై వైద్యారోగ్యశాఖ మంత్రి స్పందించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ కోరారు. ఆదివారం హైదరాబాద్ ముషీరాబాద్ జోన్ దోమల గూడా మైసమ్మ బండ బస్తీలో డీవైఎఫ్ఐ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్‌ను ఆనగంటి వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బస్తీల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రతి ఇంటికి వెళ్లి వైద్య సేవలందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దశరథ్ మాట్లాడుతూ బస్తీల్లో ఆరోగ్య సమస్యల పై అవగాహనా కార్యక్రమలు, స్పెషల్ మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో దోమలగూడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సీఐటీయూ జోన్ కార్యదర్శి వెంకటేష్, డీవైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు హస్మి బాబు, కార్యదర్శి జావీద్, జిల్లా నాయకులు రాజయ్య, నరేష్, అనిల్, సంతోష్, బబ్లు తదితరులు పాల్గొన్నారు.



