Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బారట పోచమ్మ పండగ 

ఘనంగా బారట పోచమ్మ పండగ 

- Advertisement -

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ 
మండలం కేంద్రంలోని బరడ పోచమ్మ బోనాలను మంగళవారం రోజున ఘనంగా నిర్వహించారు. గ్రామంలో మహిళలందరూ ఉపవాసం ఉండి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం మహిళలు, ఆడప డుచులు గ్రామ వీధుల్లో బోనాలు ఎత్తు కొని ఊరే గింపుగా బయలుదేరి డప్పు చప్పులతో, యువకుల కేరింతతో నృత్యాలు చేస్తూ ఆలయానికి చేరుకొని అమ్మవారికి  దీప, దూప నైవేద్యాలు సమర్పించి, కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మ వారికి మొక్కులు సమర్పించుకున్నారు. పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండా లని అమ్మవారిని వేడుకున్నారు. అంతక ముందు గ్రామప్రజలు.. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు. ఈ వేడుకల్లో భక్తులు  గ్రామ పెద్దలు,నాయకులు, మహిళలు, యువతీ, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -