- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శ్రీహరికోట నుంచి ప్రయోగించిన PSLV-C62 ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ప్రకటించారు. ప్రయోగం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాకెట్ ప్రయాణం మూడవ దశ వరకు సవ్యంగానే సాగిందని, అయితే మూడవ దశ చివరలో వాహక నౌకలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని తెలిపారు. దీనివల్ల రాకెట్ తన నిర్దేశిత మార్గం నుండి పక్కకు మళ్లిందని, ఫలితంగా ఈ మిషన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
- Advertisement -



