– 597 మార్కులతో వృతిక కృష్ణ విజయకేతనం
నవతెలంగాణ- గాంధీచౌక్
ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో ఖమ్మం నగరం శ్రీచైతన్య విద్యాసంస్థ విద్యార్థి కె.వృతిక కృష్ణ 597/600 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచినట్టు ఆ సంస్థ ఒలింపియాడ్ డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. టెన్త్‌లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని వెల్లడించారు. 70 మంది 590కి పైగా మార్కులు, 35 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించడం విశేషమన్నారు. పాఠశాల సగటు మార్కులు 600కు 594గా నమోదవడం గర్వకారణమని తెలిపారు. మొత్తం 99.5 శాతం ఉత్తీర్ణత సాధించారని, 100కి 100 మార్కులు సాధించిన విద్యార్థులు 995 మంది ఉన్నారని చెప్పారు. ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు ప్రతిభ చాటారని తెలిపారు. ప్రతి విద్యార్థిపైనా వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియెంటెడ్ టీచింగ్ పద్ధతులు, ఐపీఎల్, సీఐపీఎల్, ఎస్‌పీఎల్‌సీ బ్యాచ్‌లు, టెక్నో వంటి ప్రత్యేక అకాడమిక్ కార్యక్రమాలు, మైక్రో లెవెల్ టీచింగ్ విధానం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వివరించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.
పది ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థి స్టేట్ ఫస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



