Tuesday, January 13, 2026
E-PAPER
Homeజాతీయం2027లోగా అన్ని భాషల్లో పార్లమెంట్‌ కార్యకలాపాలు: స్పీకర్

2027లోగా అన్ని భాషల్లో పార్లమెంట్‌ కార్యకలాపాలు: స్పీకర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే పార్లమెంట్‌ సమావేశాల నుంచి అన్ని భాషల అనువాదాన్ని అమల్లోకి తెస్తున్నామని లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా వెల్లడించారు. సభ్యులు తమ సొంతభాషలో మాట్లాడే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. 2027లోగా పార్లమెంట్‌ కార్యకలాపాలన్నీ ప్రతి భాషలో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. డిజిటల్‌ సంసద్‌ యాప్‌ ద్వారా ఒకే వేదికపై అన్ని రాష్ట్రాల బడ్జెట్‌ ప్రతులు ఉంటాయన్నారు. త్వరలోనే డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -