Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి

నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి

- Advertisement -

ఎస్సీ స్టడీ సర్కిల్‌లో మెరుగైన సేవలు కల్పిస్తాం
గ్రూప్‌-1 ట్రైనీ అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నూతన ఆలోచనలు చేసి సరికొత్త కార్యక్రమాలతో ముందుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వివిధ సమస్యలతో బాధపడే ప్రజలకు నిబద్ధతతో సేవ చేయాలని గ్రూప్‌-1 ట్రైనీ అధికారులను కోరారు. సోమవారం ప్రజాభవన్‌లో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొంది గ్రూప్‌-1 సాధించి శిక్షణ పొందుతున్న వారికి ఉప ముఖ్యమంత్రి మెమోంటోలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన స్థానం నుంచి వచ్చిన వారు పేదలు సమాజంలో నిలదొక్కుకోవడానికి, ఇబ్బందులు పడుతున్న వారికి తోడ్పాటును అందించాలని సూచించారు. స్టడీ సర్కిల్‌లో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్‌ భవన్‌ ముందున్న ఎకరన్నర స్థలాన్ని బాగు చేయించి అక్కడ నిరంతరం విద్యా సదుపాయాలను కల్పిస్తామన్నారు. టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్‌-1కు ఎంపికై శిక్షణ పొందుతున్న వారు తల్లిదండ్రులు గర్వపడేలా సమాజం హర్షించేలా ప్రజలకు సేవ చేయాలని కోరారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేయాలని అన్నారు.

చరిత్రలో ఎస్సీ స్టడీ సర్కిల్‌ మరో నూతన అధ్యాయం : అడ్లూరి లక్ష్మణ్‌
రాష్ట్ర పాలనకు నూతన యువ అధికారులను అందిస్తూ రాష్ట చరిత్రలో ఎస్సీ స్టడీ సర్కిల్‌ మరో నూతన అధ్యాయం నమోదు చేసిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. సీఎం రేవంత్‌ విజన్‌, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ విధానాల విజయానికి నిదర్శనమని చెప్పారు. ఎస్సీ స్టడీ సర్కిల్‌లు ఉన్నత ఉద్యోగాలు కల్పించే విశిష్ట కేంద్రాలుగా నిలిచాయని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగం ఒక పదవి మాత్రమే కాదనీ, ప్రజల పట్ల ఉన్న గొప్ప బాధ్యత అని అన్నారు. గ్రూప్‌-1తోపాటు వివిధ కీలక హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ప్రజాసేవ పాలన విలువలకు ప్రతీకలుగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ సాధించిన ఈ ఫలితాలు కేవలం వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదనీ, సమాజమంతటికీ స్ఫూర్తినిచ్చే చారిత్రక విజయాలుగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌, ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ నర్సింహారెడ్డితోపాటు గ్రూప్‌-1లో విజయం సాధించిన ఉద్యోగులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -