Tuesday, January 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగ్రోక్‌పై రెండు దేశాలు బ్యాన్‌

గ్రోక్‌పై రెండు దేశాలు బ్యాన్‌

- Advertisement -

వాషింగ్టన్‌ : ప్రపంచ ధనవంతుడు ఎలోన్‌ మస్క్‌కు చెందిన యొక్క ప్రసిద్ధ ఎఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ మరోసారి వివాదంలో చిక్కుకుంది. గ్రోక్‌ నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్‌ చిత్రాలను సృష్టించిందనే ఆరోపణల నేపథ్యంలో ఇండోనేషియా, మలేషియా దేశాలు దీనిని తాత్కాలికంగా నిషేధించాయి. గ్రోక్‌లో మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకొని కొంతమంది నకిలీ నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్‌ చిత్రాలను సృష్టిస్తున్న క్రమంలో ఈ రెండు దేశాలు గ్రోక్‌ ఎఐపై కఠినమైన చర్యలు తీసుకున్నాయి. గ్రోక్‌ టెక్నాలజీ డిజిటల్‌ ప్రపంచంలో కొత్త ముప్పుగా మారిందని ఇండోనేషియా, మలేషియా దేశాలు పేర్కొన్నాయి. కాగా, గ్రోక్‌ ద్వారా అశ్లీల, అభ్యంతరకరమైన కంటెంట్‌ వ్యాప్తి చెందడంపై ఇటీవల భారత ప్రభుత్వం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గ్రోక్‌ ద్వారా సృష్టిస్తున్న ఈ కంటెంట్‌ ప్రజల అనుమతి లేకుండా సృష్టించబడుతోంది. ఇది వారి గౌరవం, భద్రతకు ముప్పు కలిగిస్తుంది. ఇటువంటి సాంకేతికత సమాజానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని ప్రభుత్వాలు విశ్వసిస్తున్నాయి. అయితే కంపెనీలు యూజర్స్‌ రిపోర్టింగ్‌ సిస్టమ్‌పై మాత్రమే దృష్టి పెట్టి, నిజమైన సమస్యకు ఎటువంటి నిర్దిష్ట పరిష్కారాలను అందించలేదని ప్రభుత్వాలు తెలిపాయి. దీంతో గ్రోక్‌ను తమ దేశంలో తాత్కాలికంగా నిషేధించినట్లు తెలిపింది.గ్రోక్‌ ఉపయోగించి సష్టిస్తున్న నకిలీ, అశ్లీల కంటెంట్‌ మహిళలు, పిల్లలకు తీవ్ర స్థాయిలో ముప్పు కలిగిస్తుందని ఇండోనేషియా కమ్యూనికేషన్స్‌, డిజిటల్‌ మంత్రి ముత్యా హఫీద్‌ పేర్కొన్నారు. ఇది మానవ హక్కులు, డిజిటల్‌ భద్రత యొక్క తీవ్రమైన ఉల్లంఘనగా అభివర్ణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -