Thursday, April 30, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన

అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన

- Advertisement -

– యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలం పరిశీలన
– ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ
– పలు శుభకార్యాలకు హాజరు
నవతెలంగాణ – అశ్వారావుపేట

నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు అవసరమైన స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. పాఠశాల నిర్మాణానికి అనువైన ప్రదేశం, అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు.

అనంతరం మున్సిపల్ పరిధిలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, వైద్య సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర వైద్య సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. సాధ్యమైనంతవరకు వైద్యులు ప్రాథమిక చికిత్స స్థానికంగానే అందించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సిబ్బందికి ఆదేశించారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ కాలనీకి చెందిన చుట్టూరి కృష్ణయ్య ఇటీవల ప్రమాదంలో మృతిచెందగా, ఆయన దశదిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ముచ్చిక కుటుంబ వివాహ వేడుకకు హాజరై ముచ్చిక నాగేష్–వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు వెంకటేష్–రాజేశ్వరి నూతన వధూవరులను ఆశీర్వదించారు. తదుపరి తిరుమలశెట్టి కుటుంబ వివాహ వేడుకలో పాల్గొని తిరుమలశెట్టి గోపాలకృష్ణ–భాగ్యలత దంపతుల కుమారుడు హరిసారధి–కల్పన నూతన వధూవరులను ఆశీర్వదించారు. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే పర్యటన అభివృద్ధి, ప్రజా సేవలు, సామాజిక బాధ్యతల సమన్వయంగా సాగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -