నిరసనగా చైర్‌పర్సన్‌తో సహా రచయితల సామూహిక బహిష్కరణ
సిడ్నీ : పాలస్తీనా రచయిత్రి రండా అబ్దుల్ ఫత్తాపై అడిలైడ్ ఫెస్టివల్ వేటు వేసింది.దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో ఆస్ట్రేలియాలో జరిగే ప్రముఖ ఆర్ట్స్ ఫెస్టివల్ సామూహిక బహిష్కరణ ముప్పును ఎదుర్కొం టుంది. అడిలైడ్ ఫెస్టివల్ నుంచి వైదొగులుతున్నట్టు వందమందికి పైగా రచయితలు, చైర్‌పర్సన్‌తో సహా నలుగురు బోర్టు సభ్యులు, ఒక స్పాన్సర్ ప్రకటించారు. బోండి బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఫెస్టివల్‌కు రండా అబ్దుల్ ఫత్తా ఆహ్వానాన్ని రద్దు చేసినట్టు నిర్వహకులు ప్రకటించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అడిలైట్ ఫెస్టివల్ కూడా ధ్రువీకరించింది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 15 వరకూ ఈ అడిలైట్ ఆర్ట్స్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్లో బోర్డు సభ్యులతో పాటు, మరో 124 మంది రచయితలు పాల్గొనవల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ వీరిలో 100 మందికి పైగా ఈ ఫెస్టివల్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. మిగిలినవారు కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొనడం అనుమానమే అని స్థానికులు చెబుతున్నారు. రండా అబ్దుల్ ఫత్తాకు ఆహ్వానాన్ని రద్దు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే, ఈ నిర్ణయాన్ని రండా అబ్దుల ఫత్తా కూడా ఖండించారు. ఈ నిర్ణయాన్ని పాలస్తీనా వ్యతిరేక జాత్యహంకారం, సెన్సార్ షిప్ నీచమైన చర్యగా ఆమె విమర్శించారు. నిర్వాహకుల నిర్ణయాన్ని ప్రముఖ స్వతంత్ర థింక్ ట్యాంక్, స్పాన్సర్లలో ఒకటైన ఆస్ట్రే లియా ఇనిస్టిట్యూట్ తీవ్రంగా వ్యతిరేకిం చింది. ఈ కార్యక్రమ స్పాన్సర్‌గా వైదొలు గుతున్నట్లు ప్రకటించింది. నిర్వహకుల నిర్ణయాన్ని వికారమైన రాజకీయాలుగా ఖండించింది. రండా అబ్దుల్ ఫత్తాకు ఆహ్వానాన్ని రద్దు చేయడం, ఆమెపై అణచివేతకు, ఆమె స్వరాన్ని వినిపించకుండా చేయడానికి తీసుకున్న నిర్ణయంగా ఇనిస్టిట్యూట్‌కు చెందిన ప్రధాన రాజకీయ విశ్లేషకుడు అమీ రెమికిస్ తెలిపారు.
ఈ ఫెస్టివల్ బహిష్కరించిన వారిలో న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్, గ్రీకు మాజీ ఆర్థిక మంత్రి యూనిస్ వరోఫాకిస్, బ్రిటన్ రచయిత్రి జాడీ స్మిత్, ఐరిష్ నవలా రచయిత రోయిసిన్ ఓ డొన్నెల్, రష్యన్ జర్నలిస్టు ఎం గెస్సెన్, ఆస్ట్రేలియా రచయిత్రి కాథీలెట్, తదితరులు ఉన్నారు. గతేడాది డిసెంబరు 14న సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 15 మంది మృతి చెందారు. ఈ ఘటన తరువాత ఆస్ట్రేలియాలో పాలస్తీనియ్లపై వ్యతిరేకత తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలోనే పాలస్తీనా రచయిత్రి రండా అబ్దుల్ ఫత్తాకు ఆహ్వానాన్ని అడిలైడ్ ఫెస్టివల్ నిర్వహకులు రద్దు చేశారు.
పాలస్తీనా రచయిత్రిపై వేటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



