Saturday, January 17, 2026
E-PAPER
Homeమానవిగుండె.. కొన్ని జాగ్రత్తలు

గుండె.. కొన్ని జాగ్రత్తలు

- Advertisement -

గుండె సమస్యలు ఉన్నవారు శీతాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోవడం వల్ల రక్త నాళాలు సంకోచిస్తాయి. గుండెపై అదనపు ఒత్తిడి పెరిగి ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. కాబట్టి తగిన ఉష్ణోగ్రత ఉన్న గదుల్లో ఎక్కువ గడపాలి.
శరీర ఉష్ణోగ్రత 95 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే, గుండె కండరాలకు హాని కలిగించే అల్పోష్ణస్థితికి గురవుతారు. చల్లని వాతావరణంలో ఎక్కువ సమయాన్ని గడిపేవారు, రక్తపోటు, డయాబెటిస్‌, అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలున్నవారు, ధూమపానం, పొగాకు తీసుకునే వారికి ఈ స్థితి ఇబ్బందికరం. ఇలాంటి వారు శీతాకాలంలో ఎక్కువ శ్రమించాలి. వెచ్చగా ఉండటానికి ప్రయత్నించాలి. ఉన్ని బట్టలు, టోపీలు, గ్లౌజులు, సాక్సులు ధరించాలి.
చల్లని వాతావరణంలో వ్యాయామం చేయొద్దు. ఇండోర్‌ వ్యాయామాలను ఎంచుకోవాలి. గుండెకు ఒత్తిడి కలిగించే వ్యాయామాలూ చేయొద్దు.

మద్యపానం, ధూమపానం పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్‌ చర్మంలోని రక్త నాళాలకు విస్తరించి, శరీరంలోని ముఖ్యమైన అవయవాల నుంచి వేడిని తీసుకుంటుంది. ధూమపానం గుండె వైపు ఆక్సిజన్‌ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. హృదయ స్పందన రేటు, రక్తపోటును పెంచుతుంది.
ఈ కాలంలో తాజా పండ్లు, కూరగాయలు, విత్తనాలు, కాయలు, చిక్కుళ్లు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. భోజనం, సూప్‌ వేడివేడిగా తీసుకుంటూ ఉండాలి. ఉప్పు, చక్కెర బాగా తగ్గించాలి.
జంక్‌ఫుడ్‌ పూర్తిగా మానేయాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -