మనలో ప్రతి ఒక్కరికి ఏదొక బలహీనత ఉంటుంది. దాన్ని బయటకు చెప్పలేక.. చాలా మంది ఒత్తిడికి లోనయి.. మానసిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ.. ఆ బలహీనతను దాచి ఉంచటం కన్నా.. దానిని జయించి.. మానసికంగా మరింత బలోపేతంగా మారటమే మనల్ని విజయానికి చేరువచేస్తుంది. ఈ అలవాట్లని మీ అలవాట్లుగా మార్చుకుంటే.. తిరుగులేని మానసిక శక్తిని ఆపాదించుకొని మారుతున్న ఈ కాలానికి అనుగుణంగా మరింత పటిష్టంగా తయారవుతారు.
నెగటివ్ ఆలోచనలకు దూరం..
మానసిక బలహీనతలలో ప్రధానమైనది ఆత్మన్యూనతా భావన. వీలైనంత త్వరగా దీనిని తొలగించుకోవాలి. ఈ ప్రపంచంలో ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని.. పరిష్కారం లేని సమస్య అంటూ లేదని తెలుసుకోండి.. ”నేను చేయగలను” అనే ధైర్యాన్ని కలిగించుకునేలా ప్రతిరోజూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి.
భయాలను ఎదుర్కొండి..
ఎంతటి సమస్య ఎదురైనా భయానికి లోనుకాకండి, భయాన్ని ఎదుర్కొండి. మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలనుకునే సమయంలో భయం వస్తే, ఆ పనినే పక్కగా ప్రారంభించండి. ప్రతి రోజు మీకు ఎదురయ్యే చిన్న చిన్న ఛాలెంజ్‌లను స్వీకరించండి. ఇవే మీ మానసిక బలాన్ని పెంచుతాయి.
ఇతరులతో పోల్చుకోవద్దు..
మీ ప్రయాణం.. మీ గమ్యం.. మీది మాత్రమే.. ఇతరులతో పోల్చుకోవడం మనలో మానసిక బలహీనతను పెంచుతుంది.
మానసిక ఆరోగ్యం కోసం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



