Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాతబస్టాండ్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే షిండే దిష్టిబొమ్మ దహనం

పాతబస్టాండ్ సమీపంలో మాజీ ఎమ్మెల్యే షిండే దిష్టిబొమ్మ దహనం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
బిచ్కుంద మఠాధిపతి సోమయ్య అప్పపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మద్నూర్ మండల కేంద్రంలో శనివారం మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే దిష్టి బొమ్మతో నిరసన ఆందోళన చేపట్టారు. పాత బస్టాండు సమీపంలో రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు మాట్లాడుతూ.. హనుమంత్ షిండే నీ మైండ్ పాగల్ అయింది. సోమయ్య అప్ప పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే విరమించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సోమయ్య అప్ప మఠాన్ని గాంధీభవన్ అంటావా కాషాయ బట్టలు తీసివేసి తెల్ల బట్టలు వేసుకొని రాజకీయాల్లోకి రావాలంటావా అసలు నీ మైండ్ పాగల్ అయింది. దేశంలో కాషాయ బట్టలతో రాజకీయాలు చేసేవారు చూసే ఉంటావు కదా ఆ బట్టలు ఎందుకు వదులుకోమంటున్నావ్ నీ మైండ్ పాగల్ అయింది. దానిని చూయించుకో ముందుగా క్షమాపణ చెప్పు లేకుంటే నీవు క్షమాపణ చెప్పే వరకు ఆందోళనలు మరింతగా ఉధృతం చేయవలసి వస్తోంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండ గంగాధర్, మద్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి గోపి, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు అనుమంతు యాదవ్, మండల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -