Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయాల నూతన కమిటీల ఎంపికకు నోటిఫికేషన్ జారీ

ఆలయాల నూతన కమిటీల ఎంపికకు నోటిఫికేషన్ జారీ

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్ 
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోగల దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతున్న వివిధ మండలాల పరిధిలోని ఆలయాలకు నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు కు గాను నిజామాబాద్ జిల్లా ఉమ్మడి సహాయ కమిషనర్ విజయ్ రామారావు నోటిఫికేషన్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీలను మద్నూర్  మండలంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ సలాబత్పూర్ ఆలయ అధికారులు మద్నూర్ మండల విలేకరులకు అందజేశారు. నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు కోసం గల దేవాలయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

శ్రీ సోమలింగేశ్వరా దేవాలయం దుర్కి గ్రామం బిర్కూర్ మండలం, శ్రీ రామ మందిరం బిచ్కుంద గ్రామం మరియు మండలం, శ్రీ హనుమాన్ దేవాలయం ఎక్లరా బిగ్ గ్రామం మద్నూర్ మండలం, శ్రీ లక్ష్మి నారాయణ దేవాలయం మద్నూర్ గ్రామం మరియు మండలం, శ్రీ హనుమాన్ (మారుతీ)దేవాలయం సిరసముందర్ గ్రామం బిచ్కుంద మండలం, శ్రీ లక్ష్మి నారాయణ దేవాలయం దోమకొండ గ్రామం మరియు మండలం, శ్రీ వీరేశ్వరా స్వామి దేవాలయం కాచికపూర్ గ్రామం భిక్నూర్ మండలం పై దేవాలయాల ధర్మకర్తల మండలి కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.

ఈ దేవాలయాల నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు కోసం అప్లికేషన్స తీసుకొనబడునని, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సహాయ కమీషనర్ ద్వారా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని, సలాబత్పూర్ ఆలయ అధికారులు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -