Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగరంగ వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు..

అంగరంగ వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు..

- Advertisement -

– గోవింద నామ స్మరణతో శకతోత్సవం
– వేలాదిగా తరలివచ్చిన భక్తులు
నవతెలంగాణ – ఊరుకొండ 

నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు హనుమాన్ నామస్మరణతో అత్యంత భక్తిశ్రద్ధలతో వారం రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటిరోజు ఉదయం ఊరుకొండపేటకు చెందిన కీర్తిశేషులు చిరువెల్లి కృష్ణమూర్తి శర్మ అర్చకుల గృహం నుండి ఉత్సవ మూర్తిని పల్లకిలో మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రవేశం చేయడం జరుగుతుంది.

ధ్వజారోహణము మూలస్వామి వారికి పంచామృత అభిషేకము నూతన వస్త్రధారణ వెండి అభర్ణములతో అలంకారములతో గణపతి నవగ్రహ అష్ట దిక్పాలక హనుమత్ మూల మంత్ర ప్రధాన హోమం సహస్రనామార్చన జరిపించారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ శకటోత్సవం (బండ్లు తిరుగుట) కార్యక్రమాన్ని దేవాలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, దేవాలయ ఈఓ సత్యచంద్రారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణలతో జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, దేవాలయ సిబ్బంది, అర్చకులు, పోలీస్ సిబ్బంది, వివిధ ప్రాంతాల భక్తులు, యాత్రికులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -