- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలోని హరిత హోటల్‌లో జరిగే మంత్రివర్గ భేటీ ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సమావేశంలో పురపాలక ఎన్నికలు, రైతు భరోసా, మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. సమావేశం అనంతరం మంత్రులు అక్కడే రాత్రి బస చేసి, రేపు ఉదయం వనదేవతలను దర్శించుకోనున్నారు.
- Advertisement -



