Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీపీల్లో కో- ఆప్సన్లు ఎప్పుడో.?

జీపీల్లో కో- ఆప్సన్లు ఎప్పుడో.?

- Advertisement -

ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు
జీవో రాలేదంటున్న అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు

పంచాయతీ ఎన్నికలు ముగిసి కొత్త పాలకవర్గాలు సైతం కొలువుదీరాయి,జీపీల్లో కో-ఆప్సన్లు ఎప్పడూ నియమకాలు చేస్తారని పలువురు ఆశవాహులు ఎదురుచూస్తున్నారు. అధికారులు మాత్రం ఇంకా ఆర్థర్ రాలేదు చెబుతున్నారు.2018 పంచాయతీ చట్టం ప్రకారం ప్రతీ గ్రామ పంచాయతీ పాలకవర్గంలో ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల ఎంపిక చర్చలు జోరందుకున్నాయి. గ్రామాల అభివృద్ధికి పాటు పడేవారికి కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 248 జిపిలకు744 మంది, మండలంలో మొత్తం 15 జిపిలకు 45 మంది ఆశావహులు ఈ పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

కోఆప్షన్ సభ్యుల పాత్ర ఇలా…
ప్రతీ గ్రామ పంచాయతీలో ముగ్గురు కో ఆప్షన్ సభ్యులను ఎంపిక చేస్తారు. కో ఆప్షన్ సభ్యులకు గ్రామ సభలు, పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తారు. వార్డు సభ్యులుతో సమానంగా ప్రొటోకాల్ ఉంటుంది. సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రాధాన్యం కల్పిస్తారు. నిధుల వినియోగం, అభివృద్ది ప్రణాళికల రూపక ల్పనలోనూ వీరిపాత్ర ఉంటుంది. పందాయతీలకు సలహాదారులుగా ఉంటారు.

ఎంపిక ఇలా..
గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో సమాన హోదా ఉన్న కో ఆప్షన్ సభ్యుల ఎంపికపై గ్రామాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గ్రామ సమాఖ్య: అధ్యక్షురాలు, ప్రభుత్వ పాలనాపరమైన అంశాలపై పట్టున్న రిటైర్డ్ ఉద్యోగి, గ్రామాభివృద్ధికి పాటుపడుతూ విరాళాలు ఇచ్చిన దాతలు, గ్రామా భివృద్ధికి ముందుడే వారిని ఎంపిక చేస్తారు. కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో సర్పంచ్ తో పాటు సభ్యులు, ఎమ్మెల్యేల నిర్ణయం కీలకం కానుంది. ఈ పదవులపై కన్నేసిన వారు తెరవెనుక జోదుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -