Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిషన్ భగీరథ పైప్ లైన్ చాంబర్ ప్రమాదకరం.. బర్రె దూడ మృతి

మిషన్ భగీరథ పైప్ లైన్ చాంబర్ ప్రమాదకరం.. బర్రె దూడ మృతి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రంలోని లక్ష్మీ నారాయణ గోశాల ముందు గల మిషన్ భగీరథ పైపులైన్ చాంబర్ ప్రమాదకరంగా ఉంది. ఆ చాంబర్ గుంతలో పడి బర్రెదూడ మృత్యువాత చెందినట్లు రైతు అవార్వార్ హన్మండ్లు తెలిపారు. మేత కోసం తిరుగుతూ గుంతలో పడి దూడ మృతి చెందినట్లు పేర్కొన్నారు. నాలుగు రోజులుగా వెతకగా గుంతలో విగతజీవిగా కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాని విలువ రూ. 10వేలు వరకు  ఉంటుందని పేర్కొన్నారు. కాగా మిషన్ భగీరథ అధికారులు  నిర్లక్ష్యంగా గుంత పూడ్చకుండా వదిలేయశారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ చాంబర్ పూర్తిగా మూసివేసి ఉంచాలని లేనిచో ఇలాంటి ప్రమాదాలు పశువులకే కాకుండా చిన్నారి పిల్లలకు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయని అన్నారు. దీనిని మిషన్ భగీరథ అధికారులు పరిశీలించి వెంటనే చాంబర్ పైన మూత బిగించాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -