- Advertisement -
– క్రీడా సామాగ్రి వితరణ .. సర్పంచ్ పండురెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
చెడు అలవాట్లు, వ్యసనాలకు లోనుకాకుండా ఉండాలంటే క్రీడా వ్యాపకంతో నే సాద్యం అని గ్రామీణ యువతకు సూచించారు మద్దులమడ సర్పంచ్ చిప్పల పండు రెడ్డి. మంగళవారం స్థానిక యువకులకు వాలీబాల్ క్రీడా సామాగ్రిని పంచాయితి కార్యాలయంలో ఆయన వితరణ గా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. క్రీడా వ్యాపకంతో అనేక మానసిక రుగ్మతలకు దూరంగా ఉండొచ్చు అని, శారీరిక దారుఢ్యం పెంపొందించుకోవచ్చని అన్నారు. క్రీడాకారులు రాజు,వెంకటేష్,శేఖర్,కిశోర్ లు పాల్గొన్నారు.
- Advertisement -



