Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎన్సీఈఎల్ రైతులకు నష్టం రానివ్వదు

ఎన్సీఈఎల్ రైతులకు నష్టం రానివ్వదు

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
రైతులు డెలివరీ పాలు కాకుండా రైతు దగ్గర నుండి పసుపు నేరుగా ఎగుమతి చేయడానికి ఎన్సీఈఎల్ సంస్థ పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం కోపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అధికారి సంతోష్ కుమార్ అన్నారు. ఎన్సీఈఎల్  కేంద్ర ప్రభుత్వ కోపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ తరఫున ఎన్సీఎల్ అధికారి.శ్రీ ఏం సంతోష్ కుమార్ అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలోని రైతు ఉత్పద్దర్ల సంఘాన్ని సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ.. మా జాతీయ కోపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ద్వారా నేరుగా రైతుల వద్దని సరుకు తీసుకొని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అవకాశాల గురించి వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా రైతులు దలారి పాలు కాకుండా రైతు దగ్గర నుండి నేరుగా ఎగుమతి చేయడానికి ఎన్సీఎల్ అనే సంస్థ పని చేస్తుందని తెలిపారు. కావున రైతులు ఎన్సీఈఎల్ సంస్థకు వారు పండించిన సరుకులు నాణ్యతంగా విలువ పరంగా చేసినట్లయితే వాటిని మా సంస్థ ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తామని తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఎం కే పి ఎం చైర్మన్ పాటుకూరి తిరుపతిరెడ్డి పాల్గొని రైతు ఉత్పత్తిదారుల సంఘం గురించి వారు పండిస్తున్న పంటల గురించి అధికారికి వివరించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -