Tuesday, January 20, 2026
E-PAPER
Homeజిల్లాలుప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల 

ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు 
ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం నుండి యాదాద్రి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్వా నీతి ఆధ్వర్యంలో మంగళవారం అమెరికాలోని డావోస్ జరుగుతున్న కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణతో ప్రత్యేకంగా పంపిన వీడియో ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తో పాటు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి సుస్థిర పాలన అంశాలని కులంకుశంగా వివరించారు. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన ప్రతినిధులతో ఆయా దేశాలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఆయా పారిశ్రామికుల అభివృద్ధితోపాటు తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది అన్నారు. జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామికవేత్తల అనుకున్న నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలు ఈ విధంగా ఉంటాయో చర్చల్లో వివరించినట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రపంచ సదస్సులో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -