- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు హెడ్ కానిస్టేబుల్ మోహన్ జరుపుల అన్నారు. రోడ్డు భద్రత కార్యక్రమములో భాగంగా ఆయన తన సిబ్బందితో కలిసి ఉన్నత అధికారుల ఆదేశాలతో మంగళవారం మండల కేంద్రములోని పాత బస్టాండ్ సమీపంలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేక కార్యక్రమము నిర్వహించారు. ఈసందర్బంగా అయన డ్రైవర్లకు మద్యం తాగి వాహనాలు నడపరాదు, అధిక లోడ్ తొలకూడదు, ప్రయాణికులకు వాహనాల్లో ఎక్కించుకోకూడదని, రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమములో పోలీసు సిబ్బంది తోపాటు, ఆటో యూనియన్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



