Tuesday, January 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలురిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభం 

రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు
మండల కేంద్రం బల్మూరు సమీపాన నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ భూమిలో పనులు ప్రారంభించామని సంబంధిత రైతులతో మాట్లాడి వారు ఒప్పుకున్న తర్వాతనే మిగతా పనులు జరుగుతాయని అధికారులు నిర్మాణ కాంట్రాక్టర్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. రైతులు ముందుకు వచ్చి సామరస్యంగా ఒప్పుకోవాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు. ప్రారంభ పనుల సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రాజెక్టును ఆపాలని, తమకు న్యాయం జరగాలని రైతులు విలేకరుల సమావేశంలో కోరారు. తహశీల్దార్ శ్రీకాంత్, డి.ఎస్.పి శ్రీనువాసులు, ఈ ఈ అమర్ సింగ్ ఎస్సై రాజేందర్ పోలీసులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -