కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని భువనగిరి మండలం జమ్మాపురం గ్రామంలో పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీత రావు అన్నారు. మంగళవారం మండలంలోని జమ్మాపురం గ్రామంలో ఉపాధి హామీ వర్కర్స్ తో సునీత రావు మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయం కాదని సునీతా రావు అన్నారు.
మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప మహనీయుడని గాంధీ పేరు లేకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి పాలకులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎంతోకాలంగా దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంజి ఎన్ ఆర్ ఇ జిఎ ప్రజల ఉద్యమాల ఫలితంగా రూపుదిద్దుకుందని, ప్రతి చేతికి పని పనికి పూర్తి వేతనం అనే హామీని తీసుకొచ్చిందని, గ్రామీణ భారతంలో పని కోరుకునే వారికి చట్టబద్ధమైన హక్కును కల్పించిందనారు.
మహాత్మా గాంధీ పేరును తొలగించాలని కేంద్రం నిర్ణయం పూర్తిగా భావజాలపరమైనదని గాంధీజీ శ్రమ, గౌరవం, సామాజిక న్యాయం పేదల పట్ల అపారమైన నమ్మకం ఉండేదని. మహాత్మా గాంధీ పేరు మార్పు గాంధీజీ విలువల పట్ల ఉన్న దీర్ఘకాల అసౌకర్యాన్ని ఆ నమ్మకాన్ని ప్రతిబింబించేలా చేస్తుందనారు. ప్రజాకేంద్రిత సంక్షేమ చట్టంతో జాతిపితకు ఉన్న అనుబంధాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ను రద్దు చేయడానికి బిల్లులను ప్రవేశ పెట్టడం ద్వారా అత్యంత ఆందోళనకరమైన ఉద్దేశ పూర్వకమైన అడుగు వేసింది చరిత్రత్మకమైన హక్కుల ఆధారిత ప్రజల చట్టాన్ని బలహీనపరచడం భారతదేశంలో అత్యంత గుర్తింపు పొందిన సంక్షేమ చట్టం నుండి మహాత్మా గాంధీ పేరు విలువలను తొలగించేందుకు చేసిన రాజకీయ ప్రయత్నం అని సునీతారావు అన్నారు. అనాలోచిత నిర్ణయాలతో కేంద్రం వ్యవహరించడం ప్రజా వ్యతిరేకమని ఆమె తెలిపారు కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సునీతారావు పద్మ డిమాండ్ చేశారు.
తదుపరి బాలికలకు మహిళలకు ఇంద్ర ప్రియదర్శని ఉడాన్ సానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అల్లూరి కృష్ణవేణి, సెక్రటరీ మౌనిక, జిల్లా కమిటీ మెంబర్లు బ్లాక్ అద్యక్షులు, మండలాధ్యక్షులు పట్టణ అధ్యక్షులు, పెద్ద ఎత్తున మహిళల పాల్గొన్నారు.



