చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి
నవతెలంగాణ-మిడ్జిల్
పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అన్నారు. మండలంలోని కంచనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును లబ్ధిదారులు శోభ విష్ణు, మాజీ సర్పంచ్ నరసింహులుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి అల్వాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని అన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ మహేష్, పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణ, కొత్తపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు వెంకట శివప్రసాద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల్ రెడ్డి, ఐలయ్య, వార్డు మెంబర్ చెన్నయ్య, బాలస్వామి, శేఖర్ గౌడ్, కావలి శ్రీను, అశోక్, ఐలయ్య, శాంతయ్య, లింగం, డి కృష్ణయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.



