Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణం ప్రారంభోత్సవానికి ఆహ్వానం

దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణం ప్రారంభోత్సవానికి ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు ఎంపీడీవో ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణం ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు ( శనివారం) ఉదయం 9 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క,ప్రభుత్వ విప్,ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య,తెలంగాణ మహిళ సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్  బండ్రు శోభారాణి హాజరై కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.మహిళలు, పిల్లల సంక్షేమానికి దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం కీలక వేదికగా నిలుస్తుందని, మహిళల సాధికారతతో పాటు చిన్నారుల అభివృద్ధికి ఈ కేంద్రం సేవలు అందించనుందని అధికారులు తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ తమ విలువైన సమయాన్ని కేటాయించి ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -