నవతెలంగాణ-హైదరాబాద్: లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులను నిలిపివేయాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ -నోయల్ బారోట్ శుక్రవారం పేర్కొన్నారు. ఇజ్రాయిల్ పై అమెరికా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. లెబనాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని డిమాండ్ చేసిన అమెరికా-ఇరాన్ ఒప్పంద నిబంధనలకు సవాలు విసిరేలా దక్షిణ లెబనాన్ లోని సైనిక నియంత్రణ ప్రాంతం అవతల కూడా దాడులు చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఇజ్రాయిల్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. లెబనాన్ సైన్యానికి మద్దతు పెంపొందించేందుకు ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించేందుకు తమ దేశం కృషి చేస్తోందని ఆయన మీడియాతో అన్నారు. ఒప్పందం అనంతరం ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 16మంది మరణించారని, ఈదాడులు ఇంకా కొనసాగుతున్నాయని లెబనాన్ పేర్కొంది. లెబనాన్ పై దాడులు కొత్తగా కుదిరిన ఒప్పదాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. లెబనాన్ సహా అన్ని రంగాల్లో ఇజ్రాయిల్ తన సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలి. లెబనాన్ ప్రాదేశిక సమ గ్రత, సార్వభౌమత్వాన్ని నిర్థారించాలి.
ఇజ్రాయిల్ పై అమెరికా ఒత్తిడి తేవాలి: ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



