Wednesday, August 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అబద్ధపు ప్రచారంతో ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్న బీఆర్ఎస్

అబద్ధపు ప్రచారంతో ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్న బీఆర్ఎస్

- Advertisement -

ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు

బీఆర్ఎస్ పార్టీ తమ ఉనికి కాపాడుకోవడానికి అబద్ధపు ప్రచారంతో ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్,కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్ పథకాలను రద్దు చేస్తోందని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటికే బిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం రాష్టాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పులపాలు చేసిందన్నారు. అయిన సంక్షేమ పథకాలను అందాలనే లక్ష్యంతో అప్పుకు నెలకు రూ.7500 కోట్ల వడ్డీ చేల్లిస్తోంన్నారు.పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క రేషన్ కార్డు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, దళితులకు మూడెకరాల భూమి, ఒక్క రేషన్ కార్డు, కేజీ, పీజీ విద్య, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రమ్, రుణమాఫీ తదితర హామీలు ఎందుకు అమలు చేయలేదో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట చెప్పాలని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బిఆర్ఎస్ కోట్ల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపించారు. 2014లో ఎమ్మెల్యే కాకముందు సొంత ఇల్లులేని పుట్టకు వందల ఎకరాల భూములు, రాజ విలాసాలు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. శాంతికి నిలయంగా ఉన్న మంథని నియోజకవర్గం పుట్ట ఎమ్మెల్యే అయ్యాక అరాచకాలు, హత్యలు, ఆశాంతి సృష్టించింది నిజం కాదని ప్రశ్నించారు. గత మూడు సంవత్సరాలుగా మంథని నియోజకవర్గంలో ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సస్యశ్యామలంగా, ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది కేవలం తమ నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సుభిక్షమైన పాలన వల్లనే అనేది మంథని నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -