Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజ్ విల్ తో ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు

కేజ్ విల్ తో ట్రాక్టర్లు నడిపితే కఠిన చర్యలు

- Advertisement -

ఎస్ఐ శైలెంధర్ 
నవతెలంగాణ- బాల్కొండ

బాల్కొండ మండల పరిధిలోని గ్రామాలలో ప్రధాన రహదారులపై నిర్లక్ష్యంగా కేజ్ వీల్ ట్రాక్టర్ ను ఎటువంటి పట్టీలు లేకుండా రోడ్డుపై నడపవద్దని మంగళవారం బాల్కొండ ఎస్ఐ శైలెందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. కేజ్ వీల్ ట్రాక్టర్ ను రోడ్డుపై నడపడం వల్ల రోడ్లు కొన్ని రోజులకే పాడవుతున్నయని అన్నారు . కేజీ వీల్స్ వ్యవసాయ పనులకే పరిమితమై ఉంటాయి కాబట్టి వ్యవసాయదారులు గమనించాలని సూచించారు. రోడ్డుపై కేజ్ వీల్ ట్రాక్టర్ కు పట్టిలు లేకుండా నడపడం చట్టరీత్యా నేరం ఎవరైనా అలా నిబంధనలకు అతిక్రమించి నడిపితే ఆ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. బాల్కొండ మండల పరిధిలో ఎక్కడైనా రోడ్డుపై కేజ్ విల్ ట్రాక్టర్ సేఫ్టీ బెల్టులు లేకుండా నడిపినట్టు కనబడితే ప్రజలు బాల్కొండ ఎస్ఐ ఫోన్ నెంబర్ 8712659860 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -