ఇసుక రవాణాపై గట్టిగా నిఘా
నవతెలంగాణ – బీర్కూర్ (నసురుల్లాబాద్)
అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని బీర్కూర్ ఎస్ ఐ మహేందర్ హెచ్చరించారు. మంగళవారం బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామం శివారు ప్రాంతంలోని మంజీరనది నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్లను బీర్కూర్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మహేందర్ మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాహణను అడ్డుకట్ట వేసేందుకై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ట్రాక్టర్ కు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు.
ఇందులో ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, ఇసుక వేబిల్ లను వీటిని పరిశీలిస్తున్నారు. వే బిల్, ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ రోడ్డుపై తిరిగితే తగిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని పేరొన్నారు. ఇసుక క్వారీల నుంచి ఇసుక తెచ్చేవారు అనుమతి పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. వేబిల్ ఇచ్చినచోట ఇసుక వేయకుండా మరోచోట తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇసుక దళారులను నమ్మి ట్రాక్టర్ యజమానులు నష్టపోవద్దని ఆయన సూచించారు.
ఇసుకను ఏ గ్రామానికి కేటాయిస్తే అదే గ్రామానికి వెళ్ళాలని ఆదేశించారు. ఇసుక ట్రాక్టర్లను రోడ్లపై ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి వారిపై ట్రాఫిక్ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయబడుతాయని తెలిపారు. వీరి వెంట పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



